మాదాపూర్ శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ హస్తకళా మేళా

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ శిల్పారామంలో చత్తీస్ గ‌ఢ్ హస్తశిల్ప వికాస్ బోర్డు డెవల‌ప్‌మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ సౌజన్యం తో శిల్పారామం ఆవరణ లో గాంధీ శిల్ప బజార్ హస్తకళా మేళాను ప్రారంభించారు. కేంద్ర ప్ర‌భుత్వ హ‌స్త క‌ళా ఉత్ప‌త్తుల డెవ‌ల‌ప్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ సువ‌ర్చ‌ల ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. చత్తీస్‌గ‌ఢ్ నుండి విచ్చేసిన హస్తకళాకారులు మెటల్ ఆర్ట్ , మెటల్ జ్యువలరీ, జ్యూట్ క్రాఫ్ట్ , గోండ్ పెయింటింగ్, గోండ్ పెయింటింగ్డ్స్ స్టాల్స్, డ్రెస్ మెటీరియల్స్, క్రాఫ్ట్, సిసెల్ క్రాఫ్ట్ , బస్తర్ ఢోక్రా క్రాఫ్ట్, బస్తర్ వుడ్ కార్వింగ్, వెదురు బొంగు తో తయారు చేసిన వస్తువులు, మరెన్నో ఆకర్షణీయమైన గృహ అలంకరణ వస్తువుల‌ను మేళాలో ఏర్పాటు చేశారు. రమ్య, మౌనిక, వెంకట శ్రీ లక్ష్మి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. చక్కని తలికి, మూషిక వాహన, నారాయణతే, స్వాగతం, మహాగణపతిమ్ , ముద్దుగారే యశోద మొదలైన అంశాలను కళాకారులూ లేఖ‌, ఆద్య‌, భక్తి, అనన్య, యువశ్రీ, దివంశీ, చరిష్మా ప్రదర్శించి మెప్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో చ‌త్తీస్ గ‌డ్ హ‌స్త‌శిల్ప వికాస్ బోర్డు నోడ‌ల్ ఆఫీస‌ర్ జై స‌నీష్ న‌వీన్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here