ఘ‌నంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఏక వింశః వార్షిక బ్రహ్మోత్సవం

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు సెవెన్ హిల్స్ కాలనీలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఏక వింశః (21వ) వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీ పద్మావతదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకి కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు శ్రీ పుష్ప యాగం, సుదర్శన హోమం కార్యక్రమం నిర్వ‌హించారు. ఇందులో దేవాలయం EO సత్యనారాయణ, భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఏక వింశః(21వ) వార్షిక బ్రహ్మోత్సవం లో ప్రజలందరూ కల్యాణంలో, శ్రీ పుష్ప యాగం, సుదర్శన హోమంలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు, అన్నదానం కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులయ్యారని అన్నారు. అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, ప్రజలకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయం EO సత్యనారాయణ , ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here