చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని విద్యానగర్, కైలాస్ నగర్, తారానగర్, పోచమ్మ దేవాలయం, సాయి మారుతి కాలనీ, గీత థియేటర్, మంజీరా రోడ్లలో డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీల్లో నిర్వహించిన పాదయాత్రలో టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


ఈ సందర్బంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నగరవాసులకు వచ్చే డిసెంబర్ నెల నుంచి ఉచిత మంచి నీరు అందిస్తున్నారని అన్నారు. నాయీ బ్రాహ్మణులకు, రజకులకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు. నగరాభివృద్ధికి వేల కోట్ల రూపాయలతో ఎస్ఆర్‌డీపీ ప్రాజెక్టుల ద్వారా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించడం జరిగిందన్నారు. గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో 150 కోట్ల రూపాయలతో చందానగర్ డివిజన్ లో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. చందానగర్ డివిజన్ లో ప్రతి కాలనీ ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, భారీ మెజారిటితో తెరాస పార్టీ విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రఘుపతి రెడ్డి, మిర్యాల రాఘవరావు, లక్ష్మినారాయణ గౌడ్, గురుచరణ్ దూబే, రాజు, ధనలక్ష్మి, ఉరిటి వెంకటరావు, ఓ.వెంకటేష్, లక్ష్మారెడ్డి, యాదగిరి గౌడ్, రాంచందర్, కరుణాకర్ గౌడ్, సునీత రెడ్డి, అక్బర్, అంజద్ పాల్గొన్నారు.






