పూజిత జగదీశ్వర్ గౌడ్ హయాంలోనే హఫీజ్ పేట్ డివిజన్ అభివృద్ధి: సీనియర్ నాయకులు సునీల్

హఫీజ్ పేట్(నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ హయాంలోనే డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని టీఆరెస్ పార్టీ సీనియర్ నాయకులు సునీల్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని సాయినగర్ పార్టీ నాయకులతో అయన సమావేశమయ్యారు.

పార్టీ కార్యకర్తల సమావేశం లో మాట్లాడుతున్న టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సునీల్

అనంతరం ఇంటింటికీ తిరిగి టీఆరెస్ కు ఓటు వేయమని కోరారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ డివిజన్ లో జరిగిన అభివృద్ధిని, టీఆరెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. మేనిఫెస్టో లోని అంశాలను డివిజన్ ప్రజలకు చేరవేయడం తో పాటు అర్హులందరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను చేరవేయాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల ప్రచారం లో పార్టీ నాయకులతో కలిసి ప్రజలకు కరపత్రాలు అందజేస్తున్న దృశ్యం

హఫీజ్ పేట్ డివిజన్ లో మాజీ కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత జగదీశ్వర్ గౌడ్ ల హయాంలో అన్ని కాలనీలలో మంచినీటి వసతి, రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులు పూర్తి స్థాయిలో జరిగాయని గుర్తు చేశారు. డివిజన్ ప్రజలంతా టిఆర్ఎస్ కు ఓటువేసి మరోసారి పూజిత జగదీశ్వర్ గౌడ్ ను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here