నేడు విద్యుత్ ఉండ‌ని ప్రాంతాలు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని ప‌లు ప్రాంతాల్లో గురువారం నిర్వ‌హించ‌నున్న మ‌ర‌మ్మ‌త్తుల కార‌ణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డుతుందని హైద‌ర్‌న‌గ‌ర్ ఏఈ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు 33/11 కేవీ మ‌యూరి న‌గ‌ర్ స‌బ్ స్టేష‌న్ 11కేవీ గోక‌రాజు రంగ‌రాజు ఫీడ‌ర్ ప‌రిధిలో ఉన్న గోక‌రాజు రోడ్డు, ఆర్ఎల్ సిటీ రోడ్డు, వెంక‌ట‌రాయ న‌గ‌ర్‌, బాలాజీన‌గర్‌, ఇందిర‌మ్మ కాల‌నీ, మ‌యూరిన‌గ‌ర్ పార్ట్ ప్రాంతాల్లో కరెంటు ఉండ‌ద‌ని తెలిపారు. అలాగే మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు 11కేవీ ల‌క్ష్మీ న‌గ‌ర్ ఫీడ‌ర్ ప‌రిధిలోని ల‌క్ష్మీన‌గ‌ర్‌, దోవా కాల‌నీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రోడ్డు, న‌మ‌హా అపార్ట్‌మెంట్స్‌, బుద్ధ అపార్ట్‌మెంట్స్ ప్రాంతాల్లో క‌రెంటు ఉండ‌ద‌ని అన్నారు. వినియోగదారులు విద్యుత్ స‌ర‌ఫ‌రాలో ఏర్ప‌డే అంత‌రాయాన్ని గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here