శేరిలింగంపల్లి, జనవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ హఫీజ్‌పేట్ జామియా మసీద్ కమిటీ సభ్యులు పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మసీదుకు సంబంధించిన పలు పెండింగ్ సమస్యలను, స్థానిక ప్రాంత అభివృద్ధి అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మసీదు లోపల రోడ్డు, యుజిడి పైప్ లైన్, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. సభ్యుల విన్నపాలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని మతాల ప్రార్థనా స్థలాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ కమిటీ అధ్యక్షుడులు మున్నాభాయ్, S K నజీర్(LIMRA), గౌస్, అక్రమ్, ఇబ్రహీం, అజం, నజీర్, మౌలిసాబ్, స్థానిక నాయకులు, ఇతర ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.






