శేరిలింగంపల్లి, జనవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని గంగారం పెద్ద చెరువులో స్థలాన్ని ఆక్రమించుకుని అక్రమ నిర్మాణం చేపట్టడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఓ మాజీ ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోవాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన జనం కోసం ఫిర్యాదుతో పెద్ద చెరువును సందర్శించిన హైడ్రా అధికారి బాలగోపాల్‌ను కలిశారు. చెరువులో చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని తొలగించడంతోపాటు సదరు మాజీ ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.






