నిరుపేదలకు ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయనిధి: కార్పొరేటర్ శ్రీ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఆపన్న హస్తంలా ఉపయోగపడుతుందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవ నగర్ కి చెందిన మహాదేవప్ప అత్య‌సర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 1 లక్ష 50 వేల రూపాయల విలువైన ఎల్ఓసిని బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here