శేరిలింగంపల్లి, జనవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): భారాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని పార్టీ శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై కేటీఆర్‌తో రవీందర్ యాదవ్ సుదీర్ఘంగా చర్చించారు. అక్రమ కేసుల వేధింపులను చిర్రా రవీందర్ యాదవ్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. భారాస శ్రేణులపై నమోదైన కేసుల వివరాలు, తాజా పరిణామాలను కేటీఆర్‌కు రవీందర్ యాదవ్ వివరించారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఎదుర్కొని పోరాడుతున్నామని రవీందర్ యాదవ్ స్పష్టం చేశరు. అక్రమ కేసులపై పోరాడేందుకు పార్టీ అండగా ఉంటుందని చిర్రా రవీందర్ యాదవ్ కు కేటీఆర్ హామీ ఇచ్చారు. శేరిలింగంపల్లిలో పార్టీ బలోపేతం, తీసుకోవాల్సిన చర్యలు, కార్యక్రమాలను కేటీఆర్ కి చిర్రా రవీందర్ యాదవ్ వివరించారు.






