జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్ల‌ది స్ట‌డీటూర్ కాదు, విహార యాత్ర‌: మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): స్టడీ టూర్ పేరుతో కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో GHMC కార్పొరేటర్లు విహార యాత్ర చేయ‌నున్నార‌ని, దీన్ని తాము ఖండిస్తున్నామ‌ని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బుతో విహార యాత్రలు ఎలా చేస్తార‌ని ప్ర‌శ్నించారు. 30 రోజులు పదవీ కాలం ఉండగా ఇప్పుడు స్టడీ టూర్ ఎందుక‌ని, దాని వలన ఉపయోగం ఏమిట‌నిఅన్నారు. ఇది స్టడీ టూర్ కాదు, కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దుబారా చేస్తూ చేసే విహార యాత్ర అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్యంలో ఇలాంటి దుబారా ఖర్చును అనుమతించలేదని తెలిపారు. GHMC కార్పొరేటర్ల పదవీ కాలం 10 ఫిబ్రవరి 2026 అనగా 35 రోజుల్లో ముగుస్తుంద‌ని, వారు స్టడీ టూర్ కువెళ్లి వచ్చేవరకు వారి పదవీ విరమణ అవుతుంద‌ని, మరి అలాంటి అప్పుడు స్టడీ చేసి వచ్చి ప్రజా సమస్యలను ఎలా తీరుస్తార‌ని ప్ర‌శ్నించారు ? ఇది కేవలం పదవీ కాలం ముగుస్తుందని స్టడీ టూర్ పేరుతో విహార యాత్రల‌కు వెళ్లి రావ‌డ‌మే అని అన్నారు. ప్రజలు దీన్ని గమనిస్తున్నార‌ని, ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బు తో విహార యాత్రలు చేస్తూ, రోడ్లు, డ్రైనేజీ లేక ప్రజలు ఇబ్బందులకు గుర‌వుతున్న సమయంలో కార్పొరేటర్లు విహార యాత్రకు సిద్ధం అవడాన్ని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ తర‌పున ఖండిస్తున్నామ‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here