మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గుల పోటీ సంబరాల్లో 108 మంది మ‌హిళ‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతం మాట్లాడుతూ మన సంప్రదాయ కళను నిలబెట్టడంలో మహిళల పాత్ర అమూల్యమైనదని, వారి ప్రతిభను ప్రోత్సహించే విధంగా మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మహిళల చేతిలో కళ, ముగ్గులలో మన సంస్కృతి ప్రతిబింబంగా నిలుస్తాయని, మహిళల సృజనాత్మకతే ముగ్గుల అందం అని, అదే మన సంస్కృతి గర్వం అని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, చందా నగర్ కార్పొరేటర్ రఘునాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, రఘునందన్ రెడ్డి, సునీత ప్రభాకర్ రెడ్డి , ఉరిటి వెంకట్ రావు , అంతిరెడ్డి, సౌందర్య రాజన్, శ్రీహరి, అయాజ్ ఖాన్, మూర్తి, విష్ణుమూర్తి , శాంతా పార్వతి, సంగీత, రజని, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here