శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల‌కు ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మాదాపూర్ డివిజన్ చంద్ర నాయక్ తాండా, కొండాపూర్ గ్రామంలలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో ఆలయ కమిటీల ఆహ్వానం మేరకు బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినం అందరి జీవితాలలో శాంతి, సుఖసమృద్ధులు నింపాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాల‌లో సీనియర్ నాయకుడు నరసింహ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు ఉట్ల కృష్ణ, దశరథ్, పవన్, శ్రీహరి, మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పోరేటర్ రాధాకృష్ణ యాదవ్, లింగంపల్లి కంటేస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, మహేందర్, శ్రీను నాయక్, కిరణ్, శ్రీకాంత్ యాదవ్, ఆలయకమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here