శేరిలింగంపల్లి, డిసెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల హేజల్‌వుడ్ ప్రీ స్కూల్‌లో మంగళవారం ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్లగండ్లలోని మంజీరా డైమండ్ టవర్స్ అధ్యక్షుడు నందిగామ ప్రసాద్ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారుల ప్రదర్శనలను వీక్షించారు. పలు ప్రదేశాలు, పండ్లు, పుష్పాలు, రంగులు, జంతువుల వేషధారణలతోపాటు పలు ప్రాజెక్టులతో చిన్నారులు ఈ కార్యక్రమంలో అలరించారు.







