హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తెరాస ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి పక్కా ప్రణాళికను రూపొందించి రానున్న 5 ఏళ్లలో అమలు చేస్తుందని, దీంతో నగరం విశ్వనగరంగా మారుతుందని అన్నారు. డిసెంబర్ 1న కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.







