ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసినగర్, విజయ నగర్ కాలనీ, ఆల్విన్ కాలనీ ఫేజ్ 1, ఆల్విన్ కాలనీ లాస్ట్ బస్ స్టాప్, రాఘవేంద్ర నగర్, సాయి నగర్ కాలనీల్లో డివిజన్ తెరాస అభ్యర్థి దొడ్ల వెంకటేష్ గౌడ్ మంగళవారం ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కేవలం తెరాసతోనే గ్రేటర్ అభివృద్ధి సాధ్యమని, ప్రతిపక్షాలు చెప్పే మాటలను నమ్మవద్దని కోరారు.

