ఆరెక‌పూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టంగా చెప్పాలి: బొబ్బ న‌వ‌తా రెడ్డి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పీఏసీ చైర్మ‌న్‌, శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా, లేక కాంగ్రెస్‌లో ఉన్నారా అన్న విష‌యాన్ని తేల్చుకోవాల‌ని చందాన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తా రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం చందాన‌గ‌ర్ లో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించిన అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గాంధీ బీఆర్ ఎస్ పార్టీలో ఉన్నారా ? కాంగ్రెస్ పార్టీ లో ఉన్నారా ? అని ప్ర‌శ్నించారు. స్పీకర్ నిర్ణయం ప్రకారం MLA బీఆర్ఎస్ పార్టీలోనే వున్నార‌ని తేల్చార‌ని, మ‌రి MLA బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే ఈనెల 21న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ భవన్ లో జరిగే సమావేశానికి బీఆర్ఎస్ కండువా కప్పుకొని సమావేశానికి హాజరు కావాలి క‌దా అని అన్నారు. బీఆర్ ఎస్ పార్టీ సమావేశనికి ఎమ్మెల్యే హాజరు కాని ప‌క్షంలో శేరిలింగంపల్లి ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నారు అని ఎలా నమ్ముతార‌ని అన్నారు. ఇప్పటి నుండి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు బీఆర్ ఎస్ కండువా వేసుకొని పాల్గొనాల‌న్నారు.

గాజుల రామారంలోని స‌ర్వే నెంబర్ 307లో ఎమ్మెల్యే కుటుంబం పేరు మీద ఉన్న భూమిని కాపాడుకోవడానికి, శంషీగూడ సర్వే నం 57 లోని వివాద ప్రభుత్వ భూమి స‌మ‌స్య‌ని పరిష్కరించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లార‌ని ప్రజలు అనుకుంటున్నార‌ని అన్నారు. ఎమ్మెల్యే సహచర కూక‌ట్‌ప‌ల్లి MLA కృష్ణా రావు IDPL భూములను అక్రమించార‌నే ఆరోపణలను ఆయన స్వయంగా కేంద్ర ప్రభుత్యానికి, రాష్ట్ర ప్రభుత్యానికి విజిలన్స్ కు తన మీద విచారణ జరిపి నిజానిజాలను నిరూపించాలని తనపై తానే లిఖితపూర్వకంగా విచారణ కోరార‌ని, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింద‌న్నారు. శేరిలింగంపల్లి ప్రజల ఓట్లతో గెలిచి MLA అయిన మీరు మీ మీద వచ్చిన ఆరోపణలను తప్పు అని నిరూపించుకోవాల‌ని, దర్యాపు సంస్థలను కోరి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల‌ని అన్నారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ వివాద భూముల పై విజిలెన్స్ విచారణ ఎందుకు వేయటం లేద‌ని, అందుకే మీ పై వచ్చిన ఆరోపణలు నిజమే అని ప్రజలు నమ్మే అవకాశం ఉందన్నారు.

నియోజవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాను అని ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియాలో మీరు మాట్లాడిన వార్తలను ప్రజ‌లు విన్నారు, చూశార‌ని, స్పీకర్ కోర్ట్ లో తీర్పు అనుకూలంగా వచ్చినా రాబోయే ఎన్నికలలో శేరిలింగంపల్లి ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి తగిన బుద్ధి చెబుతార‌ని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఓటు వేసి MLA గా గెలిపించిన ప్రజలను అవమానించకుండా నియోజకవర్గం పరువు తీయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరలేదని గుండె మీద చేయివేసుకొని ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. అది నిజమే అని ప్రజలు నమ్మాలంటే రేపటి నుండి బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని తిరగాల‌ని, లేని యెడల MLA పదవికి రాజీనామా చేసి తిరిగి శేరిలింగంపల్లి ప్రజల తీర్పు కోరాలని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్య‌క‌ర్త‌లుగా డిమాండ్ చేస్తున్నామ‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో సామ వెంకట్ రెడ్డి, కలిడింది రోజా, వాలా హరీష్, రవి యాదవ్, సతీష్ రావు, శ్రీకాంత్ యాదవ్, పారునంది శ్రీకాంత్, సంతోష్ రెడ్డి, మల్లారెడ్డి, సంగా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, సుబ్బ‌రాజు, సలీం, ప్రకాష్, ప్రమోద్, వంశీ, అనంత రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, నర్సింహ రెడ్డి, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here