శేరిలింగంపల్లి, డిసెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ సర్కిల్ కార్యాలయంలో పలు శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందితో ఉప కమిషనర్ శశిరేఖ సమావేశం అయ్యారు. సర్కిల్ పరిధిలోని ఏఎంసీలు, టీఐలు, బీసీలతో ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు, టీజీఎస్‌పీడీసీఎల్ పునశ్చరణ, జీఐఎస్ వినియోగం, మార్పులు, మీ సేవ దరఖాస్తుల ప్రక్రియ, ఐజీఆర్ఎస్ దరఖాస్తుల్లో డోర్ నంబర్ల జోడింపు వంటి అంశాలపై డీసీ సమావేశం నిర్వహించారు.






