శేరిలింగంపల్లి, డిసెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫేస్1 కాలనీలో కల్చరల్ సెంటర్ భవనాన్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సెంట్రల్ పార్క్ ఫేస్ 1 కాలనీలో కల్చరల్ సెంటర్ భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో తీర్చిద్దిడడం జరిగిందని, నేటితో కాలనీ వాసులకు అందుబాటులోకి రావడం జరిగిందని, ఈ కల్చరల్ సెంటర్ లో చిన్న చిన్న సమావేశాలు, సభలు, ఫంక్షన్ లు నిర్వహించుకునేందుకు వీలుగా కల్చరల్ సెంటర్ ను నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. సెంట్రల్ పార్క్ ఫేస్ 1 కాలనీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని, మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సెంట్రల్ పార్క్ ఫేస్ 1 వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ కృష్ణ, జనరల్ సెక్రటరీ వీ ధనుంజయ, వైస్ ప్రెసిడెంట్ హరికృష్ణ, ట్రెజరర్ సంతోష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మురళీధర్, డీఎల్ఎస్ఎన్ ప్రసాద్ రావు, టీ చంద్రశేఖర్, సతీష్ కుమార్, శ్రీధర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, మల్లేష్, పవన్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





