ప్ర‌తి ఒక్క‌రు ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించాలి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 14 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన‌ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని మయూరి నగర్ కాలనీ వాసులు, స్థానిక నాయకులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మయూరి నగర్ కాలనీలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అన్ని రకాల జబ్బులకు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించడం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు. మారిన జీవనశైలి, పర్యావరణంలో వస్తున్న అనేక మార్పులవల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం క‌నుక జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం, యోగా, ధ్యానం, 40 నిమిషాలు చేయాల‌ని, సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, చేపలు, గుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య శిబిర నిర్వాహకుడు మహేష్, మయూరి నగర్ అసోసియేషన్ సభ్యులు కే వెంకటరామరాజు, కిషోర్, హరికృష్ణ, ప్రవీణ్ రెడ్డి, సోమేశ్వర్ రెడ్డి, వెంకట్, శ్రీనివాస్, రమణారెడ్డి, కృష్ణ కుమార్, బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here