గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్యం

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్ పోలీసుల‌కు ఓ గుర్తు తెలియ‌ని వృద్ధుడి మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంప‌ల్లిలోని లింగంప‌ల్లి రైల్వే స్టేష‌న్ 6వ నంబ‌రు ప్లాట్ ఫామ్ వ‌ద్ద ఓ వ్య‌క్తి మృత‌దేహం ప‌డి ఉంద‌న్న స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు. మృతుడి వ‌యస్సు సుమారుగా 65 నుంచి 70 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంద‌ని, స్థానికంగా భిక్షాట‌న చేస్తూ జీవ‌నం సాగిస్తూ ఉండ‌వ‌చ్చ‌ని, వ‌య‌స్సు రీత్యా, చ‌లి తీవ్ర‌త‌ను త‌ట్టుకోలేక మృతి చెంది ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఎవ‌రైనా గుర్తు ప‌ట్ట‌ద‌లిస్తే త‌మ‌న సంప్ర‌దించాల‌ని వారు సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here