శేరిలింగంపల్లి, జనవరి 30 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులందజేతకు వ్యతిరేకంగా శేరిలింగంపల్లి బిఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆల్విన్ చౌరస్తా జంక్షన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, చందానగర్ మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి, వాల హరీష్, కలిదిండి రోజా, శ్రీనివాస్ గౌడ్, దారుగుపల్లి నరేష్, రమేష్ గౌడ్, శ్రీనివాస్, పారునంది శ్రీకాంత్, అలాఉద్దీన్ పటేల్, బాబు మోహన్ మల్లేష్, సంగారెడ్డి, రామకృష్ణ గౌడ్, గోపరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను లెక్కచేయని కేసీఆర్పై అక్రమ కేసులు పెట్టడం తగదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.






