శేరిలింగంపల్లి, జనవరి 30 (నమస్తే శేరిలింగంపల్లి): నూతన బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్ కు ఆనుకుని చందానగర్ లో కొనసాగుతున్న ఈ అక్రమ వ్యాపార కేంద్ర నిర్మాణంపై వెంటనే చర్యలు తీసుకోవాలని హైడ్రా ను జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. నూతనంగా జరుగుతున్న ఈ నిర్మాణంలో హోటల్, కిచెన్ లాడ్జిల బోర్డులను కూడా పెట్టేశారు. అక్రమ సెల్లార్ లో భవిష్యత్తులో ఫైర్ జరిగితే బాధ్యులు ఎవరు? సెట్ బ్యాక్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా నిర్మాణం పూర్తి చేశారు. హంగులు, ఆర్భాటాలతో ఏర్పాటు చేస్తున్నారు. రెగ్యులరైజ్ కోసం దరఖాస్తును జోనల్ కమిషనర్ తిరస్కరించినా కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న వ్యాపారాలను అధికారుల ఆదేశాలను ధిక్కరించి అలా ఎలా సిద్ధం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే హైడ్రా చర్యలు తీసుకోవాలని అన్నారు.






