శేరిలింగంపల్లి, జనవరి 30 (నమస్తే శేరిలింగంపల్లి): వేముకుంటలో దోమల సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మిర్యాల ప్రీతం తమ సొంత నిధులతో దోమల నివారణ కోసం ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేముకుంట బస్తీ వాసులు స్పందిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మిర్యాల ప్రీతంకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బస్తీలో దోమల సమస్య కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇటువంటి క్లిష్ట సమయంలో ముందుకొచ్చి ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మిర్యాల ప్రీతం చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో మంచి ఫలితాలు ఇస్తుందని బస్తీవాసులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ గౌడ్, పార్వతి, శాంత రాజన్, రోషన్, గౌస్, దాస్, అక్బర్ ఖాన్, అలీ, ఉదయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






