​త్రివేణి టాలెంట్ స్కూల్స్ డైరెక్టర్ డాక్టర్ జి. వీరేంద్ర చౌదరికి ప్రతిష్టాత్మక అవార్డు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ​విద్యా రంగంలో విశేష కృషి చేస్తున్న త్రివేణి టాలెంట్ స్కూల్స్ డైరెక్టర్ డాక్టర్ జి. వీరేంద్ర చౌదరిని అత్యున్నత పురస్కారం వరించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ధ్రువీకరించిన ఈయూ మీడియా (EU MEDIA) ఆధ్వర్యంలో బెంగళూరు లో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ కాంక్లేవ్ లో ఆయనకు రవీంద్రనాథ్ ఠాగూర్ నేషనల్ డైరెక్టర్స్ అవార్డు-2026ను అందజేవారు. విద్యాబోధనలో వినూత్న పంథాను అనుసరిస్తూ, విద్యార్థుల సమగ్ర వికాసానికి (Holistic Learning) త్రివేణి విద్యా సంస్థలు చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు.

త్రివేణి టాలెంట్ స్కూల్స్ ద్వారా IIT, NEET ఫౌండేషన్ కోర్సులలో నాణ్యమైన విద్యను అందిస్తూ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నారు. యువతను కేవలం చదువులో మాత్రమే కాకుండా, క్రమశిక్షణ , నైపుణ్యాలతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దడమే త్రివేణి విద్యా సంస్థల లక్ష్యం.. అని ఈ అవార్డు అందుకున్న సందర్భంగా డాక్టర్ వీరేంద్ర చౌదరి తెలియచేశారు. ​ఈ గౌరవప్రదమైన అవార్డు దక్కడం పట్ల త్రివేణి పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ డైరెక్టర్ డాక్టర్ జి. వీరేంద్ర చౌదరికి అభినందనలు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here