శేరిలింగంపల్లి, జనవరి 30 (నమస్తే శేరిలింగంపల్లి): జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని PJR స్టేడియంలో జరిగిన వర్దంతి కార్యక్రమంలో MBC చైర్మన్ జేరిపేటి జైపాల్, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, హమీద్ పటేల్, నార్నె శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి గాంధీ విగ్రహానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అహింసా మార్గంలో నడిచి, సత్యాన్ని ఆయుధంగా మార్చి దేశానికి స్వాతంత్ర్యం అందించిన గొప్ప వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. ప్రతి ఒక్కరు మహాత్ముడి ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేట్లరు, నాయకులు , కార్యకర్తలు, మహిళలు , కాలనీల అసోసియేషన్ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






