శేరిలింగంపల్లి, జనవరి 30 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో చత్తీస్‌గఢ్ రాష్ట్రం నిర్వహిస్తున్న గాంధీ శిల్ప బజార్ కి సందర్శకులనుండి మంచి స్పందన వస్తోంది. ఆర్టిఫిషల్ జ్యువలరీ, మెటల్ జ్యువలరీ, మూరల పెయింటింగ్ జ్యువలరీ, టెర్రకోట జ్యువలరీ, గోండ్ పెయింటింగ్ , డ్రెస్ మెటీరియల్స్, చీరలు మరెన్నో అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కథక్, కూచిపూడి నృత్యాలు అలరించాయి. యోగిని శిష్య బృందం కథక్ నృత్య ప్రదర్శనలో గణేష్ వందన, కృష్ణ భజన, దుర్గా దేవి, స్తుతి, తరుణ, త్రివత్, తుమరి, సర్గం, కృష్ణం వందే అంశాలను షనాయా, అనన్య, సాయిని, అన్వి, శాన్వి, రూపాలు, సుచిస్మితా, భవ్య, మిహిక, అనేక, వాణి, ఈషా ప్రదర్హించి మెప్పించారు. భావన దీప్తి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో శ్లోకాలు, జతిస్వరం, గణపతి ప్రార్ధన, శబ్దం, అన్నయ్య కీర్తనలు, తరంగం , తిల్లాన అంశాలను కళాకారులు పూర్వి స్కంద, సంజన, రక్షాకరీ, చరిత, అక్షయ లక్ష్మి, సాచి, ప్రియాంక ప్రదర్శించి మెప్పించారు.






