బీసీలంద‌రూ ఏకమై రాజ్యాధికారాన్ని సాధించాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తీన్మార్ మల్లన్న, ఒట్టి జానయ్య, హరి శంకర్ పిలుపుమేరకు బీసీ ధర్నాలో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈశ్వర్ సాయి చారి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని బీసీ ఉద్యమానికి ప్రాణాన్ని కూడా బలి ఇస్తానని చివరికి ఆత్మహుతి చేసుకున్నాడ‌ని, ప్రాణం పోతుందని తెలిసినా సాయి ఈశ్వర చారి తన ప్రాణాన్ని బిసి ఉద్యమానికి న్యాయం కోసం అమరత్వం చేశాడ‌ని అన్నారు. తీన్మార్ మల్లన్న, ఒట్టే జానయ్య, హరి శంకర్ గౌడ్ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ హరికృష్ణ, చారీ బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రమేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు నర్సింగ్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, ప్రశాంత్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, పోరాటం చేద్దామ‌ని అన్నారు. బీసీల‌ న్యాయమైన కోరికలను సాధించేవరకు ఉద్యమం చేద్దామని పిలుపునిచ్చారు. బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీలందరూ ఏకం కావాలని, ఐకమత్యంతో మనం అన్ని సాధించుకుందామని తెలిపారు. అధికారమే అంతిమ లక్ష్యమ‌ని, బహుజన రాజ్యం బీసీ రాజ్యం వచ్చేవరకు విప్లవ రూపంలో పోరాడుదాం అని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here