శేరిలింగంపల్లి, జనవరి 30 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని దోవా కాలనీ, శ్రీల గార్డెన్, న్యూ కాలనీ, శ్రీ లక్ష్మీ నగర్, FCI కాలనీ, TN నగర్, MA నగర్, ప్రశాంత్ నగర్, నాగార్జున ఎనక్లేవ్, BK ఎనక్లేవ్, రెడ్డి కాలనీ, మక్త మహబూబ్ పెట్ విలేజ్, కృష్ణ సాయి, జనప్రియ వెస్ట్ సిటీ కాలనీలలో రూ.4 కోట్ల 70 లక్షల 35 వేల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, డీజిఎం శ్రీమాన్ నారాయణ, మేనేజర్ సునీత రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

చందానగర్‌లో..
చందానగర్ డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీ, సత్య ఎనక్లేవ్, శంకర్ నగర్ కాలనీలలో రూ.84 లక్షల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, నార్నె శ్రీనివాసరావు, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, డీజిఎం శ్రీమాన్ నారాయణ, మేనేజర్ శిరీష , నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

ఆల్విన్ కాలనీలో..
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి నగర్ ఫేస్2, PJR నగర్ కాలనీలలో రూ.57 లక్షల 25 వేల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు , నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

హైదర్ నగర్ లో..
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్, అడ్డగుట్ట కాలనీల లో రూ. 62 లక్షల 50 వేల నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, UGD వంటి అభివృద్ధి పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






