హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే ప్రజలు తెరాస అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పెట్ గ్రామం, గెజిటెడ్ ఆఫీసర్స్, వినాయక్ నగర్ కాలనీల్లో టీఎస్ఈడబ్లుఐడిసి చైర్మన్ నాగేందర్ గౌడ్, హఫీజ్ పేట, మాదాపూర్ డివిజన్ల తెరాస అభ్యర్థులు పూజిత, జగదీశ్వర్ గౌడ్లతో కలిసి ఆమె మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్బంగా సునీత రెడ్డి మాట్లాడుతూ.. కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. డివిజన్ అభివృద్ధికి తెరాస అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలన్నారు. మరో సారి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.







