చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ టీఆర్ఎస్ అభ్యర్థి మంజుల రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చందానగర్ మోటార్ వెహికిల్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథరెడ్డిని అసోసియేషన్ నాయకులు ఘనంగా సన్మానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి మంజుల రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. టీఆర్ఎస్ తోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, సీఎం కేసీఆర్ మోటార్ వెహికల్స్ అసోసియేషన్ కు ఎంతో మేలు చేకూరేలా మేనిఫెస్టోలో హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. తెరాస వెంటే తాము ఉంటామని, ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపాల్, వైస్ ప్రెసిడెంట్ మొయిజుద్దీన్, సభ్యులు గోరా భాయ్, జలీల్, జావీద్ పాల్గొన్నారు.






