గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): ఎట్టి పరిస్థితిలోనూ గ్రేటర్లో తెరాస జెండా ఎగురుతుందని, మేయర్ పీఠం మళ్లీ తమకే దక్కుతుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి గ్రామం, గోపన్‌పల్లి తండాలలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, డివిజన్ తెరాస అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి ఆయన మంగళవారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ప్రజల సమస్యలపై టీఆర్ఎస్కు ఉన్నంత పట్టింపు మరే ఇతర పార్టీకి లేదని అన్నారు. నీటిపన్ను రద్దు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేకూర్చే నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. ప్రతి పక్ష పార్టీలు ఇస్తున్న హామీలను ప్రజలు నమ్మడం లేదన్నారు.


హైదరాబాద్‌లో గత ఆరున్నర ఏళ్ల కాలంలో గతంలో ఎన్నడూ లేనంత విధంగా ప్రశాంతమైన వాతావరణం ఉందని అన్నారు. అలాంటి వాతావరణం ఇక ముందు కూడా కొనసాగాలంటే తెరాస అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్‌గా సాయిబాబాకు మళ్లీ అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు నాయక్, రాజు ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, నరేష్, చెన్నం రాజు, సురేందర్, సత్యనారాయణ రెడ్డి, సత్యనారాయణ, రమేష్ గౌడ్, విజయలక్ష్మి, వెంకట్ పాల్గొన్నారు.






