శేరిలింగంపల్లి, అక్టోబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ శ్రీరామ్ నగర్ కాలనీ ఎ బ్లాక్ లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నృత్యాలు, మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మాయాసింగ్, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, చంద్రకళ, దేవిక, వరాలు, భాగ్య, కుమారి, మునావతి, పద్మ పాల్గొన్నారు.






