ప్ర‌ధాని మోదీ ప‌ట్ల ఆక‌ర్షితులై బీజేపీలో చేరుతున్న యువ‌త‌: ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్‌లోని మసీదు బండలో ఉన్న బీజేపీ కార్యాలయంలో కూకట్ పల్లి, పాపిరెడ్డి నగర్ డివిజన్ నుండి డివిజన్ ట్రెజరర్ విజయ్ కుమార్ , BJYM నాయకుడు వీరేష్ యాదవ్ ఆధ్వర్యంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ , అధ్యక్షుడు బాలు యాదవ్ సమక్షంలో పలువురు యువకులు భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్ర‌ధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి ఆకర్షితులై దేశ , రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీయే సరైనదని గమనించి యువకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతున్నామ‌న్నారు. దేశం కోసం, ధర్మం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న ప్ర‌ధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి రానున్న రోజుల్లో నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగిరే విధంగా కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్ , కవిత‌ , పవన్, ప్రేమ్, కార్తీక్, హరీష్ శేఖర్, ప్రేమ్, శివ , భాను, వంశీ , యశ్వంత్, వినయ్ , రాము, చందు , విక్కీ, సాయి ప్రణవ్, నవీన్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here