శేరిలింగంపల్లి, అక్టోబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ విలేజ్, JP నగర్ లో దసరా పర్వదినం పురస్కరించుకుని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జరిగిన అమ్మవారి ఊరేగింపు పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి వేడుకలను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, అమ్మవారి ఆశీస్సులతో శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో , శాంతి సౌభాగ్యలతో జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ ముదిరాజు, మహేందర్ ముదిరాజు, అశోక్, దయానంద్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






