దుర్గామాత పూజ‌ల్లో పాల్గొన్న మిరియాల ప్రీతం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంటలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో అన్నప్రసాదం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిరియాల ప్రీతం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని, ప్రతి ఒక్కరికీ ఐశ్వర్యం, ఆయురారోగ్యం, శాంతి, సంతృప్తి లభించాలని మనసారా కోరుకుంటున్నాన‌ని తెలిపారు.ఈ కార్యక్రమంలో సాయి, రాజన్, కన్నా, ప్రవీణ్, శ్రీకాంత్, రమేష్, సంగీత, కవిత, స్థానిక కాలనీవాసులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here