శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కనక మామిడి నరేందర్ గౌడ్ జన్మదినోత్సవ వేడుకలను హఫీజ్ పేట్ గ్రామంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ , యాదగిరి గౌడ్ , బాలింగ్ గౌతమ్ గౌడ్ , సంజీవరెడ్డి, స్నేహితులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై నరేందర్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానికంగా ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. అలాగే విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేపట్టారు.







