శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): దసరా పండుగ నేపథ్యంలో ఊళ్లకు వెళ్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని మియాపూర్ పోలీసులు స్థానిక ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీ వాసులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ దసరా పండుగ నేపథ్యంలో ఊళ్లకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంట్లో విలువైన వస్తువులతోపాటు ఆభరణాలు, నగదును ఉంచకూడదని, వీలుంటే వెంట తీసుకెళ్లాలని లేదా బ్యాంకు లాకర్‌లో భద్ర పరుచుకోవాలని సూచించారు. ఊళ్లకు వెళ్లే వారు ఇరుగు పొరుగున ఉన్న వారికి సమాచారం అందించాలని సూచించారు. గేటెడ్ కమ్యూనిటీలలో నివాసం ఉండే వారు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని అన్నారు.






