శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): బాలానగర్ ఏసీపీ పరిధిలోని జగద్గిరిగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ కేతురి నరసింహా గత అక్టోబర్ లో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. పదకొండు నెలల స్వల్పకాల వ్యవదిలోనే జగద్గిరిగుట్ట స్టేషన్ పరిధిలో లా అండ్ అడర్ సక్రమంగా నిర్వహించడం, స్థానిక ప్రజలతో మమేకమై నేరాల నియంత్రణలో ప్రత్యేక శ్రద్ద చూపించడం, బాధితులకు చట్టపరంగా నాయ్యం జరిగేలా చేస్తూ ఫ్రెండ్లి పోలీస్ కు నిలువెత్తు నిదర్శనంలాగా నిలిచారు. ఈ క్రమంలోనే సిబ్బంది, స్థానికులు బదిలీ పై వెళ్తున్న ఇన్స్పెక్టర్ నర్సింహా ను కలిసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వారు కంటతడి పెట్టుకున్నారు.






