శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలో రూ.1 కోటి 56 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణమ పనులకు, స్ట్రాం వాటర్ డ్రెయిన్ లైన్ నిర్మాణ పనులకు పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనులకు కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తూ కాలనీలలో ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలికమైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పని చేస్తున్నామని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధే ధ్యేయంగా గత నాలుగు సంవత్సరాలుగా కోట్లాది రూపాయల నిధులతో గచ్చిబౌలి డివిజన్‌ను మోడ్రన్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, మహిళా కార్యకర్తలు,అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, జిహెచ్ఎంసి అధికారులు, కాలనీ వాసులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.






