శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలోని బంజారాహిల్స్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.ఆర్. దామోదర్ రాజనర్సింహని టి ఆర్ పి ఎస్ వైద్య సంఘాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా వెంకట్ రెడ్డి మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు.






