శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సిటిజన్ కాలనీలో పి.జె.ఆర్. స్టేడియం సమీపంలో గణపతి నవరాత్రుల సందర్భంగా విగ్నహరత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేశ మండపం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మిరియాల ప్రీతం మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలంటే మట్టి విగ్రహాలను ఉపయోగించటం అనివార్యం అని అన్నారు. ఇలాంటి సామాజిక బాధ్యతను చాటుతూ యువత ముందుండటం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో కె.శివరాం, టి.విష్ణుమూర్తి, త్రినాధ్, పి. అంజిరెడ్డి, శ్రీనివాస్ నాయక్, ఊరిటి వెంకట్ రావు, కె.లక్ష్మీ విగ్నేష్, రితిక్ రెడ్డి, రిత్విక్ సాయి, చరణ్, హేమంత్ శివ, శశాంక్, వివేక్ వర్ధన్, యశ్వంత్, ఉమేష్, గణేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.






