శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని సంకల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, సామాజిక కార్యకర్త గుండ్ర రోజీకి సేవా రత్న అవార్డు లభించింది. మదర్ థెరిసా 115వ జయంతి సందర్భంగా మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రోజీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రోజీ మాట్లాడుతూ సమాజమే ఒక దేవాలయం అని, సమాజంలో ఉన్న మనుషులకు సేవ చేయడం అంటే దేవుడికి సేవ చేసినట్లే అన్న మదర్ థెరిసా మాటలే తనకు ప్రేరణగా నిలిచాయని అన్నారు. అందుకనే తన శాయశక్తులా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని, అనాథ చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తున్నానని తెలిపారు. తనకు ఈ అవార్డు దక్కడం ఎంతో గర్వంగా ఉందని, భవిష్యత్తులో చేపట్టబోయే మరిన్ని కార్యక్రమాలకు ఈ అవార్డు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.






