శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని, మట్టి వినాయకులను పూజించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ అన్నారు. తన ఆధ్వర్యంలో తయారు చేయించిన మట్టి వినాయక విగ్రహాలను నాంపల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ సమక్షంలో చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. మండపాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని, వర్షాకాలం నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.






