హోప్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల పంపిణీ

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఆరంభ టౌన్ షిప్ లో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ కొండా విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మట్టి వినాయకుల‌ని పంపిణీ చేశారు. మట్టి వినాయకులను పూజించి ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాల‌ని అన్నారు. ఆరంభ టౌన్‌షిప్ కాలనీవాసులు అందరికీ 200 మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్‌షిప్‌ కాలనీవాసులు రవీంద్ర రాథోడ్, అజయ్ కుమార్, విజయలక్ష్మి, అనిల్ కుమార్, సుధా, రమణ సుశీల, అరుణ, లోక్‌నాథ్ రెడ్డి, జనార్ధన్, ప్రవీణ్, రాంభూపాల్ రెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here