శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు కొమిరిశెట్టి సాయిబాబా ధ‌న్య‌వాదాలు

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేసినందుకు గాను బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల‌కు, ముఖ్య నాయకులకు , బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు , ఉద్యమకారులకు , సోషల్ మీడియా సైనికులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ‌జేస్తున్నాన‌ని శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ బలాన్ని , కార్యకర్తల ఐక్యతను నిరూపిస్తూ ఏకతాటి పై నడిచి సమావేశాన్ని ఇంత ఘనంగా విజ‌య‌వంతం చేయ‌డంపై ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఈ విజ‌యం సొంతం అవుతుంద‌న్నారు. రానున్న రోజుల్లో కూడా అందరూ ఇలాగే ఐక్యతను నిరూపిస్తూ పార్టీ తలపెట్టే ప్రతి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని కోరుకుంటున్నాన‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here