శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల ప్రీతం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలనె పంపిణీ చేయడం ప్రశంసనీయం అని టీపీసీసీ కార్యదర్శి, శేరిలింగంల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మిరియాల ప్రీతం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సుమారు 3 వేల మట్టి వినాయకుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని జగదీశ్వర్ గౌడ్, రంగారెడ్డి డిసిసి వైస్ ప్రెసిడెంట్ విజయ భాస్కర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ మిరియాల ప్రీతం తమ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహిస్తారని అన్నారు. మట్టి వినాయకులను పూజించడం ద్వారా పర్యవరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతామని, భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండడానికి కాలుష్య రహిత సమాజాన్ని ఏర్పాటు చేసే బాధ్యత మనందరికీ ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల ప్రీతం, విజయ భాస్కర్, గిరి, సాయి, టిల్లు, మనీ, వెంకటేష్, మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.






