శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శేరిలింగంపల్లి నల్లగండ్లలో అఖిల భారత యాదవ్ మహాసభ, గోకుల్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర యువజన నాయకుడు రాగం అభిషేక్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ శ్రీ కృష్ణ పరమాత్ముని కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండేలా వేడుకొన్నట్లుగా తెలియజేశారు.






