క్రీడ‌ల‌తో శారీర‌క ఆరోగ్యం, మాన‌సిక ఉల్లాసం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీ పార్క్ లో ఉన్న దీప్తి శ్రీనగర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్- 2025 పోటీలో DSN వారియర్స్ జట్టు విజేతలుగా, చెన్నూరు ఛాంపియన్స్ జట్టు రన్నరప్ లుగా నిలిచాయి. గెలుపొందిన విజేతలకు చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ బహుమతుల‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ దీప్తి శ్రీ నగర్ కాలనీ పార్క్ లో దీప్తి శ్రీనగర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ 2025 నిర్వహించడం చాలా అభినందనీయం అని అన్నారు. క్రీడల వలన శారీరక శ్రమ తో పాటు మానసిక దృఢత్వం లభిస్తుంది అని , క్రీడలు మానసిక ఉల్లాసంను పెంపొందిస్తాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిఎస్పి సుంకర సత్యనారాయణ, దీప్తి శ్రీ నగర్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఓం ప్రకాష్ గౌడ్ , వైస్ ప్రెసిడెంట్ జగదీష్, సెక్రటరీ దుర్గాప్రసాద్ , జాయింట్ సెక్రెటరీ చంద్రశేఖర రావు, ట్రెజరర్ శ్రీరామ్, అడ్వైజర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here