శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): ఆగస్టు 15 సందర్భంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని కార్యవర్గం, శిష్యులు కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సగౌరవంగా జరుపుకున్నారు. తొలుతగా ఆలయ పూజారిచే త్రివర్ణ పతాకాన్ని అర్చించి, హారతి ఇచ్చిన అనంతరం సంస్థ మేనేజింగ్ ట్రస్టి డా. నంద కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించి, దేశ భక్తి గీతాలు పాడి దేశ భక్తిని చాటుకున్నారు. ప్రసాదం వితరణతో కార్యక్రమాన్ని ముగించారు.






