శేరిలింగంపల్లి డివిజన్ లో ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని ప‌లు ప్రాంతాల్లో నిర్వహించిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల‌లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి జోనల్ కార్యాలయ ఆవరణలో జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కడే, ఇత‌ర డివిజన్ల కార్పొరేటర్లతో, జిహెచ్ఎంసి అధికారులతో, సీనియర్ నాయకులతో కలిసి ఈ కార్య‌క్ర‌మాల్లో రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. సుదర్శన్ నగర్ కాలనీ, శ్రీ మారుతీ నగర్, గోపినగర్ కాలనీ, ఆదర్శనగర్, ఆదర్శ్ నగర్ కమిటీ హాల్, ZPHS శేరిలింగంపల్లి, లింగంపల్లి బోరింగ్, తారానగర్ సన్ షైన్ స్కూల్, హుడా ట్రేడ్ సెంటర్, అంబేద్కర్ సర్కిల్ ఆర్జికే, ఎంపీపీఎస్ సురభి కాలనీ, హనుమాన్ యూత్ బాపునగర్, ఇందిరానగర్, గచ్చిబౌలి స్ట్రీట్ నం.1, గచ్చిబౌలి సర్కిల్ ఆటో యూనియన్, చిన్న అంజయ్య నగర్, ఆయా కాలనీలలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జాతీయ ప‌తాకాల‌ను ఆవిష్క‌రించారు. అలాగే లింగంపల్లి విలేజ్ రావ్స్ జిమ్ వద్ద SLVDC ప్రెసిడెంట్ రవి యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జాతీయ పతకాన్ని ఎగురవేశారు. గ‌చ్చిబౌలి ఓఆర్ఆర్ సర్కిల్ వద్ద జెండా వందనం అనంతరం ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ డ్రైవర్ లకు షర్ట్ లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ లోని డివిజన్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్లు, యువ నాయకులు, బస్తీ కమిటీ అధ్యక్షులు, బస్తీ కమిటీ మెంబర్లు, బూత్ కమిటీ మెంబర్లు, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here